: కేంద్రానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు: కిషన్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం తమ పార్టీకి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సచివాలయంలో కూర్చొని విభజనకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సీఎం విభజనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే... తెలంగాణ మంత్రులు మాత్రం జైత్ర యాత్రలు చేస్తున్నారని విమర్శించారు.