: హైదరాబాద్ పై గవర్నర్ పాలన అంగీకరించం: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ పై పదేళ్ల పాటు గవర్నర్ పాలన కొనసాగించాలని చూస్తే అంగీకరించమని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ నెల 11,12 తేదీల్లో ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలను కలుస్తామని చెప్పారు. కాగా, కేంద్ర హోంశాఖకు పంపిన నివేదికలను తయారుచేసిన అధికారుల పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను అవమాన పరిచేలా కేంద్ర హోంశాఖకు నివేదికలు ఇచ్చారని ఆరోపించారు.