: 2018 'పురుషుల హాకీ వరల్డ్ కప్' కు ఆతిధ్యమివ్వనున్న భారత్
2018 లో జరగనున్న 'పురుషుల హాకీ వరల్డ్ కప్' కు భారత్ ఆతిధ్యమివ్వబోతోంది. ఈ మేరకు ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) ప్రకటించింది. పురుషుల హాకీ వరల్డ్ కప్ బిడ్ భారత్ దక్కించుకోగా, మహిళల హాకీ వరల్డ్ కప్ బిడ్ ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. దాంతో, మహిళల హాకీ వరల్డ్ కప్ మ్యాచ్ లు 2018లో జులై 7 నుంచి 21 వరకు జరుగుతాయి. అటు పురుషుల హాకీ మ్యాచ్ లు డిసెంబసర్ 1 నుంచి 16 వరకు జరుగుతాయని ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడు లియాండ్రో నెగ్రె వివరించారు. ఇంతవరకు హాకీ వరల్డ్ కప్ కు భారత్ రెండుసార్లు ఆతిధ్యమివ్వగా ఇది మూడోసారి. తొలుత 1982లో ముంబయిలో, రెండోసారి 2010లో వేదికగా ఉంది.