: గౌహతి కోర్టు తీర్పుపై ప్రధానితో మాట్లాడతా: నారాయణ స్వామి
సీబీఐ రాజ్యాంగ విరుద్ధమంటూ గౌహతి హైకోర్టు వెలువరించిన తీర్పుపై కేంద్రమంత్రి నారాయణ స్వామి స్పందించారు. గౌహతి హైకోర్టు తీర్పుపై ప్రధాని, న్యాయమంత్రులతో మాట్లాడతానని తెలిపారు. దీనిపై న్యాయశాఖ అభిప్రాయాలు కూడా తీసుకుంటానన్నారు. అంతేగాక తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు.