: ఆవు పాలతో కేన్సర్ కు చెక్
గోవుపాలలో ఉన్న మరో విశిష్ఠత వెలుగు చూసింది. గ్యాస్ట్రిక్ కేన్సర్ కణాలను అంతం చేయడంలో ఆవుపాలలోని పెప్టయిడ్ అద్భుతంగా పనిచేస్తుందని తైవాన్ పరిశోధకులు కనుగొన్నారు. ఆవుపాల నుంచి సేకరించిన లాక్టోఫెర్రిసిన్ బీ25 అనే పెప్టయిడ్ కడుపులో కేన్సర్ కణాలపై ప్రభావవంతంగా పనిచేయగలదని వారు తెలిపారు. గ్యాస్ట్రిక్ కేన్సర్ నిరోధానికి వీలుగా భవిష్యత్తులో ఈ పెప్టయిడ్ ను వాడేందుకు తాజా పరిశోధన ఫలితాలు ఉపకరిస్తాయని భావిస్తున్నారు.