: నిజామాబాద్ ప్యాసింజర్ రైలులో బాంబు కలకలం
కాచిగూడ-నిజామాబాద్ ప్యాసింజర్ రైలులో ఈ రోజు బాంబు కలకలం రేగింది. రైలులో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ వెంటనే తనిఖీలు చేపట్టింది. చివరికి బాంబు లేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.