: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని ఇష్టం వచ్చిన రీతిలో దోచుకున్నారు : చంద్రబాబు


ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయోనని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని చంద్రబాబు అన్నారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని పలు సర్వేలు తేల్చి చెప్పాయని గుర్తుచేశారు. యూపీఏను చిత్తు చిత్తుగా ఓడించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని బాబు తెలిపారు. టీడీపీ మేధో మథన సదస్సులో ప్రసంగించిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే సర్వేలో 53 శాతం మంది ప్రజలు టీడీపీవైపు మొగ్గు చూపారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని ఇష్టం వచ్చిన రీతిలో దోచుకున్నారని విమర్శించారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు... తెదేపా కార్యకర్తలు కృషిచేయాలని చంద్రబాబు అన్నారు. సీట్లు పెంచుకునేందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు సిద్ధమైందని విమర్శించారు.

  • Loading...

More Telugu News