: మహిళా సంఘాల మద్దతుతో రమాదేవి కథ సుఖాంతం


ముగ్గురూ ఆడపిల్లలే పుట్టడంతో తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారని, గత రెండు రోజులుగా హైదరాబాదు దిల్ షుక్ నగర్ వికాస్ నగర్ లోని అత్తింటి ముందు ముగ్గురు కూతుళ్లతో ఆందోళనకు దిగిన రమాదేవి కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఈ ఘటన గురించి మీడియాలో వార్తలు రావడంతో... ఆమెకు తెలంగాణ జాగృతి, ఐద్వా మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. మహిళా సంఘాల చొరవతో రమాదేవి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ మధులత భాధితురాలి భర్త సంతోష్, మామ ప్రకాశ్ రావు, అత్త నిర్మలాదేవిలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. అంతేకాకుండా భార్య, భర్తలు పోలీసుల సమక్షంలో ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. అయితే మగ సంతానం లేదని వేధిస్తున్నట్టు రమాదేవి తమకు ఫిర్యాదు చేయలేదని సీఐ చెప్పటం కొసమెరుపు.

  • Loading...

More Telugu News