: గ్రూప్-1 ఇంటర్వ్యూ ఫలితాలపై హైకోర్టు స్టే
2011 గ్రూప్-1 ఇంటర్వ్యూ ఫలితాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఫలితాలను వెల్లడించవద్దని కోర్టు ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోగా దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఏపీపీఎస్సీకి నోటీసు ఇచ్చింది. గ్రూప్-1 తుది 'కీ'లో తప్పులు ఉన్నాయని అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.