: విభజనపై టాస్క్ ఫోర్స్ నివేదిక సీమాంధ్రుల స్క్రిప్ట్: కేటీఆర్
విభజనపై కేంద్ర హోంశాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిషన్ తయారుచేసిన నివేదిక సీమాంధ్రుల స్క్రిప్ట్ అని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. సీమాంధ్రుల దర్శకత్వంలోనే టాస్క్ ఫోర్స్ నివేదికను తయారు చేశారన్నారు. స్క్రిప్టును ఏకపక్షంగా రూపొందించారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కబ్జాలు టాస్క్ ఫోర్స్ కు కనబడలేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. తన సొంత జిల్లాకు సీఎం రూ.500 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారని విమర్శించారు. చిత్తూరు జిల్లా మంచినీటి పథకంలో వందల కోట్ల కమిషన్ల కుట్ర జరుగుతోందన్నారు. సీఎం నిలువు దోపిడీ కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేని ఆంక్షలు హైదరాబాదుపైనే ఎందుకు ఉండాలని కేటీఆర్ నిలదీశారు.