: సీబీఐ రాజ్యాంగ విరుద్ధం: గౌహతి హైకోర్టు
ఇదో సంచలన తీర్పు. సీబీఐ రాజ్యాంగ విరుద్ధమైనదని, అది పోలీసులా వ్యవహరించడానికి వీల్లేదంటూ గౌహతి హైకోర్టు తీర్పు చెప్పింది. నేరాల దర్యాప్తు అధికారాలు సీబీఐకి లేవని స్పష్టం చేసింది. దీంతో కేసులు నమోదు చేయడం, నిందితులను అరెస్ట్ చేయడం లాంటి అధికారాలను సీబీఐ కోల్పోవాల్సిన క్లిష్ట పరిస్థితి ఎదురైంది. 1963లో సీబీఐని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఆదేశాలను కోర్టు నిలిపివేసింది. 50ఏళ్ల క్రితం తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం పొందలేదని, కనుక దాన్ని శాసనంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. గౌహతి హైకోర్టు ఆదేశాలను కేంద్రం సుప్రీం కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది.