: 'పోలవరం'పై సీబీఐ విచారణ జరపాలి: కిషన్ రెడ్డి
పోలవరం టెండర్ల వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, యూపీఏ సర్కారు అవినీతిమయమైందని అన్నారు. కాగా, కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకే పోలవరం కాంట్రాక్టును ట్రాన్స్ ట్రాయ్ కి అప్పగించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ట్రాన్స్ ట్రాయ్ బోగస్ కంపెనీ అని తేలినా టెండర్లను కట్టబెట్టడంలో మతలబేంటని ఆయన ప్రశ్నించారు.