: నెల్లూరు జిల్లాలో అర్ధాంతరంగా ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ


నెల్లూరు జిల్లా కోట మండలం సిద్ధవరం గ్రామంలో తోళ్ల పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు  అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను గందరగోళ పరిస్థితుల నడుమ అర్ధాంతరంగా ముగించారు. తొలుత గ్రామానికి వచ్చిన అధికారులను పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలు అడ్డుకున్నారు.

అయినా అభిప్రాయ సేకరణ కొనసాగుతుండడంతో.. ఆగ్రహంతో గ్రామ తహసీల్దార్ ను నిర్బంధించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా కలెక్టర్, పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్థులకు నచ్చజెప్పేయత్నం చేశారు. అయినా వినని ప్రజలు కలెక్టర్ పై కారం చల్లారు.

ఈ సమయంలో పోలీసులు కలెక్టర్ కు అడ్డుగా నిలుచున్నారు. అనంతరం కార్యక్రమాన్ని కలెక్టర్ అక్కడికక్కడే నిలిపివేశారు. పరిశ్రమ ఏర్పాటుపై ప్రజాభిప్రాభియాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. 

  • Loading...

More Telugu News