: ప్రకాశం జిల్లాలో టూరిస్టు బస్సును ఢీ కొట్టిన లారీ: ఇద్దరు మృతి


ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు ర్యాంపు సమీపంలో టూరిస్టు బస్సును వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని సారామణి మండల్, బోలానాధ్ గా గుర్తించారు. బస్సు తిరుపతి నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిలో ప్రయాణిస్తున్న వారంతా పశ్చిమ బెంగాల్ ఫరక్ నాజ్ జిల్లా బడయిపూర్ మండలం లోని ఉత్తరాబాద్ గ్రామానికి చెందినవారు. క్షతగాత్రులను ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

  • Loading...

More Telugu News