: కోట్ల రేటు పలికిన పికాసో 'పిల్లల' చిత్రం
చిత్రకారుల చిత్రాలు చాలా వెల కలిగివుంటాయి. అందునా పికాసో చిత్రమంటే ఇక చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరున్న చిత్రాకారుడిగా పికాసో కళాకారులకు చిర పరిచితుడు. ఆయన గీసిన ఒక చిత్రం కోట్ల రూపాయల ధరను పలికింది. దీన్నిబట్టే పికాసోకి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజుంది అనే విషయం అర్థమవుతుంది.
పికాసో గీసిన ఇద్దరు పిల్లల చిత్రాన్ని న్యూయార్క్‌లోని క్రిస్టీ సంస్థ వేసిన వేలంలో కోట్లు కుమ్మరించి సొంతం చేసుకున్నారు. చైనాకు చెందిన అపర కుబేరుడిగా పేరొందిన వాంగ్ జియాన్‌లిన్ ఈ చిత్రాన్ని వేలంలో రూ.175 కోట్లను వెచ్చించి సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం పికాసో గీసిన చిత్రం కావడం ఒక ప్రత్యేకత అయితే, ఇందులోని ఇద్దరు పిల్లలు పికాసో సంతానం కావడం మరో విశేషం. కాబట్టే ఈ చిత్రం అంత ధర పలికింది!