: ఇక హెచ్‌ఐవీ దాగుడుమూతలు సాగవు


మన శరీరంలోకి ప్రవేశించిన హెచ్‌ఐవీ కణాలు మన శరీరంలోనే దాక్కొని చాలా రోజుల తర్వాత వాటి ప్రభావం చూపుతాయి. అలాకాకుండా ఆరంభంలోనే వాటిని గుర్తించినట్టయితే ఈవ్యాధి నివారణకు ప్రత్యేక ఔషధాలను ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇలా హెచ్‌ఐవీ కణాలు దాక్కోవడానికి తోడ్పడుతున్న శరీరంలోని ప్రత్యేక పొరను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పొర శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రేరేపితం కాకుండా హెచ్‌ఐవీ కణాలు లోపల దాక్కోవడానికి తోడ్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

బ్యాక్టీరియా, వైరస్‌ వంటివి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. అప్పుడు ఇన్‌ఫెక్షన్‌కు గురైన కణాల్లోని రక్షణ వ్యవస్థ ప్రేరేపితమై ఇతర కణాలకు హెచ్చరికలను చేస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ తర్వాత హెచ్‌ఐవీ కణాల్లోని రెండు అణువులను తనకు అనుకూలంగా మలచుకుంటున్నట్టు అవి ఆ వైరస్‌ జన్యుపదార్ధం త్వరగా పునరుత్పత్తి కాకుండా ఆపుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. తాము కనుగొన్న విషయాలు హెచ్‌ఐవీ లేదా ఎయిడ్స్‌కు సరికొత్త చికిత్సలను రూపొందించడానికి, ప్రస్తుతం ఉన్న చికిత్సలను మరింత మెరుగుపరచడానికి దారి తీయగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News