: రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరిన ఏపీఎన్జీవోలు


రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరినట్లు ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఈ నెల 16న హైదరాబాదులో సమావేశం నిర్వహిస్తామని, సభ వేదిక కోసం రెండు మూడు స్థలాల్లో అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేశామని చెప్పారు. ఏలూరు సహా సీమాంధ్ర జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 9 నుంచి 14 వరకు ఢిల్లీలో ఉంటామన్నారు. ఈ సందర్భంగా వివిధ జాతీయ పార్టీ నేతలను కలుస్తామని అశోక్ బాబు వెల్లడించారు.

  • Loading...

More Telugu News