: బస్టాప్ లో నిలుచున్న వారిపైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు విద్యార్ధినులు మృతి


విజయవాడలోని రామవరప్పాడు బస్టాప్ లో బస్సు కోసం నిలుచున్న ప్రయాణికులపైకి కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్ధినులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు ఎస్ఆర్ కే ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధినులు జ్యోతిర్మయి, చందూశ్రీలుగా, మూడో విద్యార్ధినిని విజయ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన సింధూజగా గుర్తించారు. చికిత్స పొందుతున్న ముగ్గురిలో ఒక విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉంది.

  • Loading...

More Telugu News