: 'సడక్ బంద్' పేరుతో రహదారుల దిగ్బంధం: టీ జేఏసీ
తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే జాతీయ రహదారుల దిగ్బంధంకు ’సడక్ బంద్‘గా జేఏసీ నామకరణం చేసింది. ఈ పేరుతోనే రహదారుల దిగ్బంధం జరుగుతుందని జేఏసీ తెలిపింది. ఈ నెల 24న బెంగళూరు జాతీయ రహదారినీ, మార్చి 2న విజయవాడ జాతీయ రహదారినీ దిగ్బధించినట్లు ఐక్య కార్యాచరణ సమితి ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.