: సచిన్ చాలా గొప్ప వ్యక్తి : రాహుల్ గాంధీ


సచిన్ టెండూల్కర్ ను కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆకాశానికెత్తేశారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన సచిన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మరికొద్ది రోజుల్లో రిటైర్ అవుతున్న సచిన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ... సచిన్ ఎంత గొప్ప క్రికెటరో, అంత గొప్ప వ్యక్తి కూడా అని అన్నారు. సచిన్ తో తనకు మంచి స్నేహం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News