: శవాలై తేలిన నలుగురు యాడ్ ఏజెన్సీ ఉద్యోగులు
ఈ నెల మొదటి తేదీన అదృశ్యమైన నలుగురు యాడ్ ఏజెన్సీ నిపుణులు ఈ రోజు పుణెలోని ఓ నదిలో శవాలై తేలారు. వివరాల్లోకి వెళితే.. ప్రణవ్ లెలే, చింతన్ బుచ్, సాహిల్ ఖురేషి, శృతిక చంద్వానీ పుణెకు చెందిన ఓ ప్రకటనల కంపెనీలో పని చేస్తున్నారు. గోవా టూర్ కి అని సిల్వర్ హుండాయ్ ఐ20 కారులో బయలుదేరి వెళ్లారు. ఆ రోజే విచిత్రంగా కనిపించకుండా పోయారు. అయితే, వారికేమైంది? అనేది కూడా తెలియలేదు. ముందు ఈ విషయాన్ని తల్లిదండ్రులు అంత సీరియస్ గా తీసుకోలేదు.
కానీ, వారితో ఉన్న యువతి మధ్యలో దిగి ఇంటికి వెళ్లాలి. చేరుకోకపోవడంతో కంగారుపడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, వెతుకులాట మొదలుపెట్టిన పుణె పోలీసులు మొన్న ఆ నలుగురిలో చింతన్ బుచ్ అనే యువకుడి మృతదేహాన్ని ఓ నది వద్ద కనుగొన్నారు. వెంటనే నదీ ప్రాంతాల్లో తీవ్రంగా వెతికిన వారికి మిగతా ముగ్గురు, కారు కూడా దొరికాయి. వీరు పుణె టోల్ ప్లాజా దాటినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియో ఆధారంగా తెలుసుకున్నారు.