: బోనులో.. మేకతో పులి మమేకం..!


బాగా ఆకలిగొన్న పులికి ఓ మేకను ముందుపెడితే ఏంచేస్తుంది..? మేక సాధుజీవి కాబట్టి పెద్దగా శ్రమపడకుండా ఓ పంజా దెబ్బతో దాన్ని చంపి ఆబగా లాగించేస్తుంది. కానీ, మహారాష్ట్రలోని బోర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఓ విచిత్రం చోటుచేసుకుంది.

పులి ఉన్న బోనులోకి ఓ మేకను ఆహారంగా పంపారట. అక్కడి సిబ్బంది అందరూ 'చచ్చిందిరా మేక' అనుకుని ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు. అయితే, ఆశ్చర్యకరంగా ఆ పులి.. మేకతో చక్కగా ఆడుకుంటూ కనిపించడంతో అధికారులు విస్మయం చెందారు. రెండు రోజులు గడిచినా పులి-మేక చెలిమి అలాగే కొనసాగిందట.

ఆకలి దహించి వేస్తున్నా ఆ వ్యాఘ్ర రాజం మేకను తాకకపోవడంతో దానికి గొడ్డుమాంసాన్నిఆహారంగా అందించారు. మేకను చంపకపోవడానికి కారణాలు విశ్లేషిస్తూ, పులిని బోనులో ఉంచడం వల్ల అది తన వేట నైపుణ్యాన్ని కోల్పోయిందని, అందుకే మేకను చంపలేకపోయిందని సూత్రీకరించారు. ఏమైనా ఆ మేక భలే అదృష్టవంతురాలు కదూ..! 

  • Loading...

More Telugu News