: ముఖ్యమంత్రిని మారుస్తారని అనుకోవడం లేదు : జేసీ
సీఎం కిరణ్ ను పదవి నుంచి తప్పిస్తారని తాను భావించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని మార్చి అధిష్ఠానం మరో తప్పును చేస్తుందని తాను అనుకోవడం లేదని అన్నారు. ప్రజల మనోభావాలనే సీఎం వినిపిస్తున్నారని... దీన్ని ధిక్కారం అనుకుంటే అనుకోండని చెప్పారు. అధిష్ఠానానికి కిరణ్ సహకరిస్తారా? లేదా? అన్న విషయం రేపు తేలిపోతుందని తెలిపారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనకు మంచి మిత్రుడని... ఆయన సీఎం అయితే తనకు సంతోషమేనని జేసీ అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు మద్దతిస్తున్న పార్టీలకు జేసీ కృతజ్ఞతలు తెలిపారు.