: మంత్రి రఘువీరాకు సమైక్య సెగ
రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డికి సమైక్య సెగ తగిలింది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రఘువీరారెడ్డి ప్రయాణిస్తున్న కారును సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో, కారు దిగిన ఆయన ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినని సమైక్యవాదులు... పదవికి రాజీనామా ఎందుకు చేయలేదంటూ రఘువీరాను ప్రశ్నించారు. కొద్దిసేపటి తర్వాత పోలీసుల అండతో మంత్రి అక్కడ నుంచి వెళ్లిపోయారు.