: హెచ్ఐసీసీలో ముగిసిన ప్రపంచ వ్యవసాయ సదస్సు
హైదరాబాదులోని హెచ్ఐసీసీలో ప్రపంచ వ్యవసాయ సదస్సు ముగిసింది. సదస్సు ముగింపు కార్యక్రమానికి హాజరైన స్పీకర్ నాదెండ్ల మనోహర్... రైతు సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా, శాస్త్రవేత్తల కృషి కూడా కొనసాగాలని పేర్కొన్నారు. సదస్సులో వచ్చిన సిఫార్సుల్లో రైతులకు అవసరమైనవి అమలు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. నాలుగు రోజులు జరిగిన ఈ సదస్సులో పలు విషయాలపై చర్చించి, రైతులకు పలు సూచనలు చేశారు.