: అశ్విన్ హాఫ్ సెంచరీ... భారత్ 264/6


భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. కష్టాల్లో కూరుకుపోయిన భారత ఇన్నింగ్స్ ను తన బ్యాటింగ్ తో ఆధిక్యానికి తీసుకెళ్లాడు. అశ్విన్ కేవలం 71 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అశ్విన్ టెస్టుల్లో తన హాఫ్ సెంచరీల రికార్డును నాలుగుకి పెంచుకున్నాడు. ప్రస్తుతం భారత్ 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 76 పరుగులతో, అశ్విన్ 58 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News