: మెట్రో ప్రాజెక్టులో ఎవరికీ ముడుపులివ్వలేదు: ఎల్ అండ్ టీ సీఈవో
మెట్రో ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగిందంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను... ప్రాజెక్టును చేపట్టిన ఎల్ అండ్ టీ సంస్థ సీఈవో వీబీ గాడ్గిల్ ఖండించారు. ఈ ప్రాజెక్టులో ఎవరికీ ముడుపులు ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టు కోసం ప్రలోభాలకు గురిచేసే అలవాటు ఎల్ అండ్ టీకి లేదని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను తమ సంస్థ పూర్తి చేసిందని.. నాణ్యత, కచ్చిత ప్రమాణాలతో నిర్మాణం చేస్తున్నందుకే తమకు ప్రాజెక్టులు వస్తున్నాయని గాడ్గిల్ స్పష్టం చేశారు. ఎన్ని సమస్యలు ఎదురైనా నిర్ణీత సమయంలోగా మెట్రో రైలును పూర్తి చేస్తామని మీడియా సమావేశంలో తెలిపారు.