: కాంగ్రెస్ కు ఓటేస్తే కేజీ బొగ్గును కూడా మిగల్చదు: మోడీ


ఛత్తీస్ గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరస్కరించినందుకు చత్తీస్ గఢ్ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని మోడీ అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. కాలం మారిందని, కులాన్ని చూడకుండా అభివృద్ధి కోసం ఓటేయాలని పిలుపునిచ్చారు. బస్తర్ సభలో మోడీ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ కు ఓటేస్తే చత్తీస్ గఢ్ లో కేజీ బొగ్గును కూడా మిగల్చదని ఘాటుగా హెచ్చరించారు. గిరిజనుల కోసం వాజపేయి తొలిసారిగా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేశారని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక చాలా ఏళ్లకు గిరిజనుల అభివృద్ధి గురించి మాట్లాడుకోవడానికి కారణం వాజపేయేనని తెలిపారు.

  • Loading...

More Telugu News