: నేను కూడా ఎంపీ భార్యా బాధితురాలినే
బీఎస్పీ ఎంపీ ధనుంజయ్ సింగ్ భార్య జాగ్రితి సింగ్ తనను కూడా తీవ్రంగా వేధించినట్లు మరో పనిమనిషి ముందుకు వచ్చింది. ఎంపీ భార్య తనను తీవ్రంగా కొట్టిందని, వంటికి నిప్పటించిందని.. దాంతో ప్రస్తుతం నడవలేకున్నానని పేర్కొంది. పనిమనిషి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ నమోదు చేశారు. మంగళవారం ఉదయం ధనుంజయ్ సింగ్ ఇంటిలో పనిచేసే ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణానికి జాగ్రితి వేధింపులే కారణమని తోటి పనిమనుషులు చెప్పడంతో.. పోలీసులు జాగ్రితితోపాటు ఎంపీ ధనుంజయ్ సింగ్ ను అరెస్ట్ చేయగా కోర్టు వారిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది.