: నెట్ వాడకంలో హైదరాబాదీయులది మూడో స్థానం
దేశంలో ఇంటర్నెట్ వాడే వారిలో హైదరాబాదీయులు మూడో స్థానంలో ఉన్నారు. ఇక్కడ 47 లక్షల మంది యూజర్లు ఉన్నారని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) తెలిపింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతో ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య పెరగానికి దోహదపడుతోందని పేర్కొంది. ముంబై అత్యధిక వినియోగదారులతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 1.20కోట్ల మంది నెట్ వాడుతున్నారు. 81లక్షల మందితో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. చెన్నైలో 45లక్షలు, కోల్ కతాలో 44లక్షలు, బెంగళూరులో 38లక్షల మంది నెట్ వాడే వారు ఉన్నారని ఐఏఎంఏఐ వెల్లడించింది.