: సీమాంధ్రకు సమన్యాయం చేశాకే ముందుకెళ్లానని కోరాం : చిరంజీవి
విభజన విషయంలో సీమాంధ్రులకు సమన్యాయం చేశాకే ముందుకెళ్లాలని కేంద్రాన్ని కోరామని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. అందుకు మంత్రి వీరప్ప మొయిలీ స్పందిస్తూ.. సమన్యాయం చేశాకే ముందుకెళ్తామని చెప్పారన్నారు. మొయిలీతో భేటీ ముగిసిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో లక్షల మంది సీమాంధ్ర ప్రజలున్నారని, రాష్ట్రం విడదీస్తే వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వివరించామని తెలిపారు. నీరు, విద్యతో పాటు... ఉద్యోగులకు తీవ్ర సమస్యలు ఏర్పడతాయని చెప్పామని ఆయన పేర్కొన్నారు.