: భారత జట్టు ప్రస్తుతం టాప్ గేర్లో వెళుతోంది: రవిశాస్త్రి


ఆస్ట్రేలియా జట్టును వరుసగా రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడించిన భారత జట్టు ప్రస్తుతం టాప్ గేర్లో  పయనిస్తోందని మాజీ ఆటగాడు రవిశాస్త్రి అన్నాడు. చెలరేగుతున్న బౌలర్లు, కదం తొక్కుతున్న బ్యాట్స్ మెన్ తో టీమిండియాకు తిరుగులేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. జట్టులో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కడే విఫలమవుతున్నాడని రవిశాస్త్రి చెప్పాడు.

ఉప్పల్ పిచ్ పై పోరాడకుండానే చేతులెత్తేసిన కంగారూలకు ఇప్పుడు  స్పిన్ భయం పట్టుకుందని వ్యాఖ్యానించాడు. దక్షిణ భారత దేశంలో రెండు టెస్టుల్లో ఓడిన ఆసీస్ ఇప్పుడు ఉత్తరాదికి తరలిందని అక్కడ పిచ్ లు కాస్త పేస్ కు అనుకూలించడం వారికి కొంచెం ఊరట కలిగించే విషయమని ఈ ఆల్ రౌండర్ అభిప్రాయపడ్డాడు. 

  • Loading...

More Telugu News