: మొయిలీతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ


కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఢిల్లీలో భేటీ అయ్యారు. మంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, జేడీ శీలం, పురంధేశ్వరి మొయిలీని కలిసిన వారిలో ఉన్నారు. చమురు, సహజవాయువుకు సంబంధించిన అంశాలపై మొయిలీతో మంత్రులు చర్చిస్తున్నారు. దీంతో పాటు, రాష్ట్ర పరిస్థితులు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొయిలీతో భేటీ అనంతరం, సీమాంధ్ర కేంద్ర మంత్రులు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మన్మోహన్ తో సమావేశమవుతారు.

  • Loading...

More Telugu News