: ప్రజాభిప్రాయ సేకరణతో నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత
నెల్లూరు జిల్లా కోట మండలం సిద్ధవరంలో తోళ్ల పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళంగా మారింది. గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు వచ్చిన అధికారులను పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలు అడ్డుకు
దీంతో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. పరిశ్రమ ఏర్పాటు తమకు ఇష్టంలేదని ప్రజలు తెగేసి చెప్పారు. తిరిగి వెళ్లాలంటూ గ్రామస్థులు అధికారులను హెచ్చరించారు. ఈ సమయంలో రంగంలోకి దిగిన పోలీసులు భారీ బందోబస్తు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు.