: ప్రసవం తర్వాత కొవ్వును ఇలా కరిగించుకోవచ్చు


ప్రసవానికి ముందు పెద్దదిగా సాగివుండే పొట్టను ప్రసవానంతరం తగ్గించుకోవడం కాస్త కష్టమే. అయితే మన ఆహారంలో కొన్ని చిన్న చిన్న మార్పులను చేసుకుంటే ప్రసవం తర్వాత పొట్ట చుట్టూ పేరుకుని ఉన్న కొవ్వును కరిగించుకోవడం సాధ్యమేనంటున్నారు నిపుణులు. ఇందులో మొదటిది తాజా పండ్లను తీసుకోవడం. పండ్లు తీసుకోవడం అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో పండ్లు తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టి తీసుకోవడం కాకుండా ఎప్పటికప్పుడు తాజా పండ్లను తీసుకోవాలి. అలాగే తాజాగా వండిన ఆహారం తీసుకోవాలి.

ఏ కాలానికి తగిన విధంగా లభించే కూరగాయలను ఆ కాలంలో తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం తీసుకోకుండా రోజూ కాస్త మార్పు ఉండాలి. ఈ సమయంలో ఆకలి ఎక్కువగా అనిపించినా ఎక్కువగా ఆహారం తీసుకోకుండా మితమైన ఆహారం తీసుకోవాలి. వైద్యుల సలహాలను అనుసరించి చిన్న చిన్న వ్యాయామాలను చేస్తూవుండాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది యోగా చేయడం. యోగాలో ప్రాణాయామం బరువు తగ్గడంలో చక్కగా తోడ్పడుతుంది. ప్రసవం అయిన తర్వాత వైద్యులను సంప్రదించి యోగా క్లాసుల్లో చేరి యోగా సాధన చేయడం ద్వారా కూడా పూర్వపు ఆకృతి పొందవచ్చు. మరో ముఖ్యమైన విషయమేమంటే ఆహారాన్ని బాగా నమిలి తినడం. మనం తీసుకునే ఆహారాన్ని ముద్దలుగా మింగడం కాకుండా చక్కగా నమిలి తినడం వల్ల ఆహారం బాగా జీర్ణం కావడమేకాకుండా, నమలడం వల్ల మన నోటికి కూడా మంచి వ్యాయామంగా చెప్పవచ్చు.

  • Loading...

More Telugu News