: క్యాన్సర్‌ను కంట్రోల్‌ చేసే కమలాలు


ఈ సీజన్‌లో ఎక్కువగా లభించే కమలాపండ్లతో పలు లాభాలున్నాయి. ఎక్కడ చూసినా చక్కగా మన కళ్లకు కళకళలాడుతూ కనిపించే కమలా పండ్లు బోలెడు ప్రయోజనాలను కలిగివుంటాయి. వీటిలో సిట్రస్‌ పాళ్లు ఎక్కువ. వీటిని తినడం వల్ల చర్మం, ఊపిరితిత్తులు, కడుపు, పేగుల్లో క్యాన్సర్‌ రాకుండా మనల్ని కాపాడుతుంది. అలాగే కమలాపండ్లను రసంతీసి తాగడం వల్ల కిడ్నీ జబ్బులు కూడా రావు. కిడ్నీల్లో రాళ్లు చేరే అవకాశం ఉంటే కమలాపండ్లు దాన్ని నిరోధిస్తాయి. కాలేయ క్యాన్సర్‌ను అరికడుతుంది. ఇంకా శరీరంలో కొవ్వు పేరుకోవడాన్ని ఇది అరికడుతుంది. కొలెస్టరాల్‌ పెరుగుదలను నిరోధించడంలో కమలాలు చాలా శక్తిమంతంగా పనిచేస్తాయి.

కమలాపండ్లలో ఉండే ఫైబర్‌ జీర్ణశక్తిని మెరుగుపరిచి, ఆకలిని పుట్టిస్తుంది. హృదయస్పందనలకు అవసరమైన పొటాషియం, మెగ్నీషియం కమలాపండ్లలో పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లు రక్తపోటును అదుపులోవుంచి, పల్స్‌ రేటులో హెచ్చుతగ్గులు రాకుండా చూస్తాయి. ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్‌ సి వల్ల చర్మానికి కావలసిన జీవశక్తి లభిస్తుంది. చర్మకణాలు పాడవకుండా సి విటమిన్‌ కాపాడుతుందని వైద్యులు చెబుతారు. అలాగే వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా కమలాలు కాపాడుతాయి. శరీరంలోని మలినాలను శుద్ధిచేసి మనల్ని ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంచే కమలాపండ్లను చక్కగా రోజూ తినడం వల్ల మనం చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News