: ఆడపిల్లలే పుట్టారని ఇంటినుంచి గెంటేశారు
మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వారు సాధించలేనిది ఏదీ లేదు. అమ్మాయి అంటే అకాశంలో సగం.. అందుకే అవకాశాల్లో సగం అంటున్నాయి ప్రభుత్వాలు. అలాంటి ప్రస్తుత కాలంలో ఓ మహిళకు అందరూ ఆడపిల్లలే పుట్టారని ఇంటి నుంచి గెంటేశాడో పురుష పుంగవుడు. హైదరాబాదు, దిల్ షుక్ నగర్ లోని వికాస్ నగర్ కు చెందిన సంతోష్ కు తొమ్మిదేళ్ల క్రితం పరిగికి చెందిన రమాదేవితో వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురూ ఆడపిల్లలే అంటూ అత్తింటి నుంచి, భర్త నుంచి రమాదేవికి వేధింపులు ఎక్కువయ్యాయి. దాంతో ఆమె మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. దీనిపై ఆగ్రహించిన ఆమె భర్త ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆమె తన పిల్లలతో కలిసి భర్త ఇంటి ముందు బైఠాయించింది.