: అసోంలో భూకంపం.. ఆరుగురు విద్యార్ధులకు గాయాలు


అసోంలో స్వల్ప భూకంపం సంభవించింది. అసోంలోని కొన్ని ప్రాంతాల్లో భూమి కొన్ని సెకెన్ల పాటు కంపించింది. గోలాఘాట్ జిల్లాలో ఓ పాఠశాలకు పగుళ్లు ఏర్పడగా, ఓ పాఠశాలలోని ఆరుగురు విద్యార్థులు భవనంపై నుంచి దూకి గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇతర ప్రభుత్వ పాఠశాలలు, భవనాలకు పగుళ్లు ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. కాగా రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5 గా నమోదైంది. ఈ ఘటనలో తీవ్ర నష్టం సంభవించలేదు. కర్బి వద్ద 20 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News