: జీవీకే వన్ లో తూనికలు కొలతల శాఖ తనిఖీలు.. కేసులు నమోదు
హైదరాబాద్ లోని బడా షాపింగ్ మాల్స్ పై తూనికలు, కొలతల శాఖాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా సరకులను విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న పలు దుకాణాలపై అధికారులు కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్ లోని జీవీకే వన్ సముదాయంలోని దుకాణాలపై అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దుకాణ యజమానులు ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయించడాన్ని గుర్తించిన అధికారులు కేసులు నమోదు చేశారు.