: మళ్లీ లీకైన ఓఎన్జీసీ గ్యాస్
ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కొద్దిరోజుల కిందటే పైపు లైన్ నుంచి గ్యాస్ లీకై ప్రజలు భయాందోళనలకు గురైన సంఘటన మరువక ముందే మరోసారి గ్యాస్ లీక్ అయింది. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం అడవిపాలెం వద్ద పైపు లైన్ల నుంచి భారీ శబ్దంతో గ్యాస్ వెలువడుతోంది. ఇటీవల కాలంలో ఇలా జరగడం ఇది రెండోసారి. అయినా, అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.