: సంతకమైనా ఇక తెలుగులోనే: బుద్ధప్రసాద్
తెలుగును అధికార భాషగా మార్చే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. అధికార భాషా చట్టం ఏర్పడ్డ మే 14వ తేదీని అధికార భాషాదినోత్సవంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెల్లడిస్తామని అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు.
ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాల్లో దరఖాస్తులను తెలుగులోనే రాయాలనే నిబంధనలను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల సంతకాలు, పెన్షన్లు, అడ్వాన్సులు, ఇంక్రిమెంట్లతో పాటు సెలవు వంటి దరఖాస్తులు తెలుగులోనే జరగనున్నాయి.