: టీడీపీలో చీడపురుగులున్నాయి.. వెళ్లగొడతా: ఎర్రబెల్లి


తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీలోని సీమాంధ్ర నేతలపై ఎదురుదాడికి దిగారు. పార్టీలో చీడపురుగులున్నాయంటూ పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాద్ పై మండిపడ్డారు. టీడీపీ నుంచి తాను వెళ్లే ప్రశ్నేలేదని.. చీడ పురుగులను పార్టీ నుంచి వెళ్లగొడతానన్నారు. తెలంగాణపై పార్టీ అధినేత చంద్రబాబు రాసిన లేఖను వెనక్కి తీసుకుంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ లబ్ది పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. లేఖను వెనక్కి తీసుకునే ప్రస్తక్తే లేదని, టీడీపీ తెలంగాణకు కట్టుబడి ఉందన్నారు.

  • Loading...

More Telugu News