: మిజోరాం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఈసీ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25న జరగనున్న ఎన్నికలకు ఈశాన్య రాష్ట్రం మిజోరాం సిద్ధమైంది. ఎన్నకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వీఎస్ సంపత్ తెలిపారు. మొత్తం 1,126 పోలింగ్ బూత్ లు ఏర్పాటుచేయగా, వాటిలో 94 పోలింగ్ బూత్ లు ఉన్న ప్రాంతాలు చాలా సమస్యాత్మకంగా ఉన్నాయని, ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో భధ్రతను మరింత కట్టుదిట్టం చేశామని చెప్పారు. పోలింగ్ రోజు భారీ సంఖ్యలో ప్రజలు ఓటింగ్ లో పాల్గొనాలని సంపత్ కోరారు.