: రాహుల్ గాంధీ ర్యాలీని అడ్డుకున్న సర్పంచ్
జమ్మూ కాశ్మీర్ లో రాహుల్ గాంధీ చేపట్టిన ర్యాలీని పరీక్షిత్ సింగ్ అనే సర్పంచ్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై రాహుల్ కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సర్పంచ్ లకు తగినంత సాధికారత ఇవ్వడం లేదని, భద్రత కల్పించడం లేదని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలకయితే భారీ భద్రత కల్పిస్తున్నారని చెప్పారు. తమ మీద దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవాలని కోరారు. ఇతనికి పలువురు ఇతర సర్పంచ్ లు కూడా మద్దతు పలికారు. ఈ సభకు దాదాపు 30 వేల మంది పంచాయతీరాజ్ ప్రతినిధులు హాజరయ్యారు.