: చావెజ్ మృతిపట్ల ఒబామా, బాన్ కీ మూన్ సంతాపం
వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మృతిపట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ సంతాపం వ్యక్తం చేశారు. వెనిజులా మంచి నేతను కోల్పోయిందని వారు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆ దేశ ప్రజలకు అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుందని ఒబామా ఈ సందర్భంగా తెలిపారు.