: తెలంగాణ ప్రదేశ్ గా మార్చుకోండి.. రాష్ట్రం ముక్కలు చేయకండి: రాయపాటి
తెలంగాణ వారు రాష్ట్రం పేరును తెలంగాణ ప్రదేశ్ గా మార్చుకున్నా తమకు అభ్యంతరం లేదని ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, తాను సమైక్యవాదినని... తెలుగు జాతిని రెండు ముక్కలుగా నరక వద్దంటూ కాంగ్రెస్ హైకమాండ్ కు సూచించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని, సమైక్యంగా ఉంటేనే రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి లాభమని ఆయన అభిప్రాయపడ్డారు.