: డిజిటల్ వెర్షన్ లో ఖురాన్.. రాజ్ థాకరేకు బహుమతిగా
పవిత్ర ఖురాన్ ను ముంబయికు చెందిన ఓ వ్యాపారవేత్త డిజిటల్ వెర్షన్ లోకి తీసుకొచ్చారు. దేశంలోని ముస్లిం, ముస్లిమేతరులు కూడా చదువుకునేందుకు దీన్ని అందుబాటులో ఉంచుతున్నారు. డజనకు పైగా భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని అతని తరఫున... మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఉపాధ్యక్షుడు, యాసర్ అరాఫత్ చారిటబుల్ ట్రస్ట్ హెడ్ హాజి అరాఫత్ షేక్ తెలిపారు. దీని మొదటి సెట్ ను ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేకు బహుమతిగా అందించారు.