: బాలయ్య బాబుకు గాయాలు


ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ విశాఖలో జరుగుతున్న షూటింగ్ లో గాయపడ్డారు. విశాఖ లోని సింహాచలంలో జరుగుతున్న 'లెజెండ్' షూటింగ్ సందర్భంగా బాలయ్య మోచేతికి స్వల్ప గాయం అయినట్లు సమాచారం. దీంతో బాలయ్యను విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మళ్లీ యథావిధిగా ఆయన షూటింగ్ లో పాల్గొన్నారు. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ గా కనిపించనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News