: సమైక్య రాష్ట్రమే మా విధానం : అసదుద్దీన్ ఒవైసీ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ అభిప్రాయమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. హైదరాబాద్ ను యూటీ చేయడానికి ఒప్పుకోమని కుండ బద్దలు కొట్టారు. రాష్ట్ర విభజనపై జీవోఎంకు నిన్ననే నివేదిక పంపిన ఎంఐఎం... ఆ వివరాలను ఈ రోజు ప్రకటించింది. మీడియా సమావేశంలో ఈ వివరాలను అసదుద్దీన్ వెల్లడించారు.
ఒకవేళ గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే... కర్నూలు, అనంతపురంతో కూడిన రాయలతెలంగాణను ఏర్పాటు చేయాలని ఒవైసీ కోరారు. షరతులు లేని రాజధానిగా హైదరాబాద్ ఉండాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. కేబినెట్ నోట్, విధివిధానాల్లో హైదరాబాద్ పై క్లారిటీ లేదని విమర్శించారు.