: నేడు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్న రాహుల్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన జమ్మూలోని పీసీసీ కార్యాలయంలో... స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం, సీఐఐ సభ్యులతో భేటీ అవుతారు. ఈ రోజు రాత్రి ఆయన జమ్మూలోనే బసచేస్తారు.
రేపు ఉదయం పుల్వామా జిల్లాలో కొత్తగా నిర్మించిన ఉద్యానవనానికి చెందిన స్టోర్స్ ను ప్రారంభిస్తారు. అనంతరం బద్గమ్ లోని మహిళల స్వయం సహాయక బృందాలతో సమావేశమవుతారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశంలో పాల్గొంటారు. అనంతరం, గురువారం సాయంత్రం రాహుల్ ఢిల్లీ చేరుకుంటారు. జమ్మూ కాశ్మీర్ లో రాహుల్ పర్యటన నేపథ్యంలో, ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది.